Thursday, March 17, 2011

జగన్ పార్టికి మే 16లోపే గండం !

  
జగన్ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టి జెండాను ఆవిష్కరించిన ముహూర్తం 12.3.2011 -2.29 అదిరిందని చెప్పడం కేవలం వై.ఎస్., వై.ఎస్.జగన్ మీద అభిమానంతో కాదని ముందుగానే చెప్పేసుకుంటున్నా.
ఏ సిద్దాంతి కుదిరాడో  గాని ఆయనకో సలాం. (అయినా ముహూర్తం కుదరడానికి కూడ ఒక అర్హత, పూర్వ జన్మ సుకృతం ఉండాలిగా - మన కిరణ్ గార్కి కుదర్చటానికి పండితులు కరువయ్యారా -అదేం కాదు -అతనికి ఆ వ్రాత లేదంతే)

ఇక విషయానికొస్తా. జెండా ఆవిష్క్రరణ ముహూర్తం కర్కాటక లగ్నం - వృషభరాశి. ఈ కాంబినేషన్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏమంటే లగ్నాధిపతి అయిన చంద్రుడు పరమోచ్చ స్థానంలో ఉంటాడు.(ఇది తమిళ నాట "కరుణ" జాతకంలోని అంశము) ఆ మద్యలో 13 సం.లు అధికారంలో లేకున్నా అతని నాయకత్వం చెక్కుచెదరలేదంటే చూడండి.

ఇక మరణాన్ని సూచించే శని విక్రమ స్థానంలో నిలిచాడు. అంటే ఈ పార్టి ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడక బుల్లెట్లా దూసుకుపోతుందన్న మాట ( దీని చెడు ఫలం సోదరుల పైనే పడుతుంది కాబట్టి సోదరికి వచ్చిన నష్ఠమేమి లేదు) . రాహు ఆరున ఉండి శతృవుల భలాలను పీల్చి పిప్పి చేస్తాడు. మైనారిటిల ఆధరణ మెండు. ఏడున శుక్రుడున్నాడు. ఇది భవిష్యత్తులో ఈ పార్టితొ చెలిమి కోరి వచ్చే వారు నెత్తికెక్క కుండా కట్టిడి చేస్తుంది. ( అయితే దీని చెడు ప్రభావం జగన్ సతీమణి పై పడొచ్చు)

ఇక అష్ఠమంలోని రవి కుజ కలయక చూస్తే .. ఈ పార్టి "వచ్చి పోయే పార్టి" కాదనిపిస్తుంది. మరణాన్ని సూచించే స్థానంలో పంచమాధిపతి + జీవనాధిపతి అయిన కుజుడు ఉన్నందున చావో రేవో తేల్చుకునే రీతిలోనే పార్టి కార్య కలాపాలు సాగుతాయి. మరో విశేషం ఏమంటే వాక్కు స్థానాధిపతి అష్ఠమంలో పడటం. దీని ఫలం మాటలు తక్కువ -చేతలు తక్కువ ( అవసరమైతే ప్రాణ త్యాగాలు -జైళ్ళ పాలుకు సైతం సిద్దపడేలా చేస్తుంది)

కాని పార్టి మీటింగులు,కార్యక్రమాల్లో అగ్ని ప్రమాదం,ఎలక్ట్ర్రిక్ షాక్ సర్క్యూట్ జరిగే ప్రమాదం కూడ ఉంది.తస్మాత్ జాగ్రత్త!

భాగ్య స్థానమున ఆరు పన్నెండు అధిపతుల కలయక జరిగింది. ఇది దూరా భారంలో (దిల్లి) ఉన్న శతృవులను నశించి ,కృశించి వేస్తుందంటే నమ్మండి. అయితే గురుడుకి భాగ్యాధిపత్యం సైతం ఉన్నందున రాజా రెడ్డి కాలం నాటి ఆస్తులు సైతం కరిగి పోయే ప్రమాదం కూడ ఉంది.

దూర ప్రయాణంలో ఒక సారి అస్వస్థతకు గాని ప్రమాదానికి కాని గురయ్యే అవకాశం కూడా ఉంది. వృషభరాశికి గోచారంలో ఐదున ఉన్న శని జూన్ పన్నెండునుండి ఆరును వీక్షించడం మొదలు పెడ్తాడు. పెడితే శతృవుల అడ్రస్సులు గల్లంతవుతాయంటే నమ్మండి.

ఇక దాశాభుక్తుల కథకొస్తే 12/Mar/2011 => 16/May/2011 దాకా చంద్రదశలో కేతు భుక్తి. ఆ లోపు పార్టి ఉంటుందా పోతుందా అన్నంత పరిస్థితి ఎదురుకావచ్చు. కాని ఆ తరువాత తమాయించుకుని దుమ్ము రేపుతుంది. ప్రత్యర్దులకు దిమ్మ తిరిగుతుంది.

జెండా రంగులు ఓకె.నిలువునా ఉండడం వెరైటిగానే ఉంది. మద్యలో వై.ఎస్. ఓకె.( ఇదే నా కాన్సెప్టు కూడా) కాని వై.ఎస్. చుట్టూ పెట్టిన బొమ్మలు మరీ ప్రభుత్వ కార్యాలయ గోడ పై పెయింటింగ్ లాగా ఉంది. వై.ఎస్. అంటేనే సంక్షేమానికి మారు పేరు.వై.ఎస్. ముఖం చూడగానే ఆయన ప్రవేశ పెట్టిన పథకాలన్ని గుర్తుకొస్తాయి. అటువంటిది ఈ బొమ్మలెందుకో నాకర్థం కావడం లేదు. పాపం కార్య కర్తలు వాల్ రైటింగ్ చెయ్యాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు.

No comments:

Post a Comment