Saturday, April 9, 2011

Jaganism first anniversary

"జగనిజం" ప్రారంభించబడి ఒక సవంత్షరం పూర్తి చేసుకున్న సందర్భంగా సభ్యులు, మిత్రులు, శ్రేయాభిలాషులు, అభిమానులు, జగన్ అన్న, YSR కాంగ్రెస్ పార్టీ  అభిమానులు ఆందరూ కలిసి అభినంధన సభ ఏర్పాటు చేసుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

కేక్ కట్టింగ్ అనంతరం చెన్నై "జగనిజం" అధ్యక్షుడు వర్రా రాజాకృష్ణ రెడ్డి మాట్లాడుతూ రైతు పక్షపాతి, అపర భగీరథుడు దివంగత ముఖ్యమంత్రి శ్రీ Dr. YS రాజశేఖర రెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా, ప్రజలకిచ్చిన మాట కోసం తన పదవిని త్రునప్రాయాంగా వదిలేసి , ప్రజల చెంతకు వెళ్తూ, మీకోసం నేనున్నానంటూ వారికీ భరోసా కల్పిస్తూ తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్న మన ప్రియతమ యువనేత శ్రీ YS జగన్మోహన రెడ్డి గారికి మా వంతుగా తోడ్పడాలనే సదుద్దేశ్యంతో, అభిమానం లోనే కాదు, ఆదర్శం లోను ముందు ఉంటాం .. అనే నినాదంతో "జగనిజం" పురుడు పోసుకుంది. 
తన తండ్రి కోసం ప్రాణాలర్పించిన వారి ఇళ్ళకి వెళ్లి ఆ ఆత్మీయులని కలుస్తూ, పేరు పేరున పిలిచి ఓదారుస్తూ, వారి జీవితాల్లో ఒక నుతనోత్తేజాన్ని నింపుతూ, వారి ముఖాల్లో పూర్వపు వెలుగులు వేదజల్లడానికి ఒక మహాన్నోత ఆశయంతో ప్రారంభించబడిన "ఓదార్పు యాత్ర" రోజునే "జగనిజం" కూడా ప్రారంభించబడినది.
అప్పటి నుంచి ఎన్నో బృహత్తర కార్యక్రమాలని చేపడుతు, అన్న చేసే ప్రతి కార్యక్రమంలో మా వంతు పాలుపంచుకుంటూ, ఎంతో మంది NRI ల ప్రోత్సాహంతో పేదల పక్షపాతి, రైతు కి చిన్న మేలు జరుగుతుందంటే చాలు అది ఎంత పెద్ద పనైనా, ఎవరు అడ్డొచ్చిన లెక్క చేయకుండా ఆ పని జరిగేటట్లు చూసి, ఆ రైతు ముఖంలో ఆనందాన్ని పంచి, ఎముక లేని చేయి అని పిలిపించుకున్న YSR  సువర్ణ పాలన స్థాపనే ధ్యేయంగా అన్ని ప్రముఖ నగరాలలో ఎన్నో వేలమంది సభ్యులతో, సూరజ్ కుమార్, జూపూడి జేసింత్ పాల్ అధ్వార్యంలో "జగనిజం" తన కార్యకలపాలని కొనసాగిస్తుంది.
ఈరోజు YSR జిల్లా పులివెందులలో "జగనిజం" రాష్ట్రా అధ్యక్షుడు సూరజ్ కుమార్, ముఖ్య కార్యదర్శి జూపూడి జేసింత్, స్టీఫెన్ (చిత్తూర్), చైతన్య (బెంగుళూరు), బజీద్ (ప్రకాశం), గంగాధర్ రెడ్డి (కడప),  మహేష్ నాయుడు (రంగారెడ్డి) మరియు అభిమానులతో జలయజ్ఞ ప్రదాత, అపర భగీరథుని సమాధి వద్ద వార్శికోత్శవ సభ కి వెళ్ళారని అందువల్ల ఇక్కడ పాల్గొనలేక పోయారని, మరియు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలలో వేర్వేరుగా ఈ వార్శికోత్శవ సభలు జరుగుతున్నాయని "జగనిజం" చెన్నై అధ్యక్షుడు వర్రా రాజాకృష్ణ రెడ్డి ఒక ప్రశ్నకి సమాధానంగా చెప్పారు.
చెన్నై విభాగపు ముఖ్య కార్యదర్శి కార్తికేయన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ అన్నని ముఖ్యమంత్రిగా చూడటమే "జగనిజం" లక్ష్యమని, దీనికి అడ్వైసరి కమిటి, వొమెన్ సెల్, ఆన్లైనే వింగ్ విడివిడిగా ఏర్పాటు చేయబడి, వివిధ రూపాలలో తమ సేవలని అందిస్తున్నాయని, రీసెంట్ గా YSR పై ఒక CD ni విడుదల చేసామని, జగన్ అన్న పై అభిమానం ఉండి, సేవ చేయాలన్న ఆలోచనతో ఉన్న వారందరూ ఆహ్వానీతులే అని దీనిలో చేరగోరే వారు +91 8144 255 375 కి ఫోన్ చేయొచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్తికేయన్ రెడ్డి, సుభ్రమణ్య శర్మ, రవి నాయుడు, పీర్ షహేబ్, మస్తాన్ వలి, యేసు దాసు, కళ్యాణ్ చౌదరి, రీనా శర్మ, మరియు తదితరులు పాల్గున్నారు.

No comments:

Post a Comment