Monday, May 2, 2011

నే చేరలేని కళల తీరనివి నీవైతే ..!

నే చేరలేని కళల తీరనివి నీవైతే,
అనుక్షణం నిను చేరాలని ఆరాటపడే ...
అలను నేనౌతా ... !

నీ అడుగులతో చేరలేని అడుగులు నావైతే,
...నీవొదిలిన నీ మృదుపాదాల ..
అడుగుల జాడలు నేనౌతా ... !!

నీ చేయందుకోలేని వాడను నేనైతే,
మృదుకోమలమైన నీ అర చేతిలోన ..
పండిన గోరింటాను నేనౌతా ..!!!

నీ హృదిని స్పందింపజేయలేని హృదయం నాదైతే,
ప్రతిక్షణం నీలోన మ్రోగేటి ..
నీ హృదయ స్పందన నేనౌతా ... ప్రియా !!!!

ప్రేమతో ... నీ,
- కార్తికేయన్ రెడ్డి.

1 comment:

  1. Ha ha ... very nice Karthi... !!

    Regards,
    Priya.

    ReplyDelete